అస్వస్థతకు గురైన దగ్గుబాటి వెంకటేశ్వరరావు

  • మందపల్లి శనేశ్వరస్వామి ఆలయ దర్శనానికి వెళ్లిన దగ్గుబాటి
  • శని దోష నివారణ కోసం తైలాభిషేకం చేయిస్తుండగా కళ్లు తిరిగిన వైనం
  • ఆలయం వద్ద సేద తీరిన మాజీ మంత్రి
మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరావు అస్వస్థతకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే... కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి శనేశ్వరస్వామి వారి ఆలయ దర్శనానికి దగ్గుబాటి వెళ్లారు. శని త్రయోదశి సందర్భంగా శని దోష నివారణ కోసం తైలాభిషేకం చేయిస్తుండగా... కళ్లు తిరిగి తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. 

దీంతో, ఆయన సన్నిహితులు ఆయనను ఆలయం వద్ద నీడలో కాసేపు సేద తీర్చారు. పూజ పూర్తి కాకముందే ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో తన కుటుంబసభ్యులు, సన్నిహితులు పూజను ముగించేంత వరకు ఆయన అక్కడే ఉన్నారు.  

Daggubati Venkateswara Rao
Health

More Telugu News